దాదాపు 3 సంవత్సరాల క్రితం ఈనాడు లో నెమలికన్ను మురళి గారి బ్లాగ్ చూసినప్పుడు నాకు మొదటిసారి బ్లాగ్ లోకం తో పరిచయం కలిగింది. అప్పటినుంచి నేను కూడా ఒక బ్లాగ్ మొదలుపెట్టాలని ఎన్నో సార్లు అనుకున్నాను కానీ చదవటానికి కూడా టైం సరిపోని పరిస్థిలో వున్న నాకు రాయటం అనేది అందని ద్రాక్ష గానే మిగిలి పోయింది. ఇదిగో ఇన్ని రోజుల తరవాత కాస్త టైం దొరికి, ఎలాగైఅతేనేం చివరకి మొదలు పెట్టేసాను. టైం లేదు అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నా నాకు, బ్లాగ్ create చేయటానికి మాత్రం ఎక్కువ టైం పట్టలేదు.
బ్లాగ్స్ చదవటం మొదలు పెట్టినప్పటినుంచి నెమలికన్ను మురళి గారికి ఏకలవ్య శిష్యరికం చేస్తున్న నేను అయన రేంజ్ లో కాకపోఇన కనీసం జనాలకు అర్ధం అయ్యే రేంజ్ లో ఐన టపాలు రాయగలనో లేదో చూడాలి. కనీసం రాయటానికి ప్రయత్నిస్తానని మాత్రం చెప్పగలను.
అన్నట్టు ఇందులో ఏమి రాస్తావు అని అడిగితె మాత్రం ఇది అని చెప్పలేను, ప్రస్తుతానికి నా ఆలోచనలు, అభిప్రాయాలూ, అనుభవాలు అని మాత్రం చెప్పగలను.
అభినందనలు కరుణ గారూ! మీ శైలిలో మీరు సాగిపొండి..
ReplyDeleteఇంతకీ అగ్రిగేటర్లకి (కూడలి, జల్లెడ, మాలిక, హారం...) మీ బ్లాగు వివరం పంపారా? వారి ద్వారా ఎక్కువమంది పాఠకులకి చేరుతుంది బ్లాగు...
బాగా వ్రాస్తున్నారు.
ReplyDeleteఆల్ ది బెస్ట్.. కరుణగారూ.
@మురళి గారు: :-) కృతఙ్ఞతలు అండి. ఇప్పుడే పంపించాను అందరి అగ్రిగేటర్లకి నా వివరాలు.
ReplyDelete@గీతిక గారు: కృతఙ్ఞతలు గీతిక గారు.
అభినందనలు...
ReplyDeleteస్వాగతం.. కొంచెం ఆలస్యం గా
ఎప్పుడు చెప్పాము అని కాదండి, ఎలా చెప్పాము అనేది పాయింట్ :-)
ReplyDeleteధన్యవాదాలు.