ఈ కాలం పిల్లల్ని చూస్తే అబ్బ వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు అని ఎవరికైనా అనిపిస్తుందేమో. నా కొడుక్కి 6 సం వయస్సు, కానీ వాడు అడిగే ప్రశ్నలు చుస్తే చాల ఆశ్చర్యం వేస్తుంది నాకు ఒక్కోసారి. ఒక్కోసారి నవ్వు కూడా వస్తుంది అనుకోండి.
ఒకసారి నేను గులాబ్ జామున్స్ ఫ్రై చేస్తున్నాను. వాడు నా పక్కకు వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తాను మమ్మీ అన్నాడు. అప్పుడు నేను వద్దు నాన్న ఇది ఆయిల్, చాల వేడిగా వుంటుంది. అది మీద పడితే చాల డేంజర్ అన్నాను. అప్పుడు వాడు మరి మనమే అందులో పడితే? అని అడిగాడు. అప్పుడు నేను మనం వెంటనే emergency కి వెళ్ళాలి అన్నాను. అప్పుడు వాడు "మమ్మీ ఇప్పుడు గులాబ్ జామున్ కూడా emergency కి వెల్లాల ?" అని అడిగాడు. ఇది జరిగినప్పుడు వాడి వయసు 4yrs . ఇది తలుచుకుంటే ఇప్పటికి నాకు నవ్వొస్తుంది.
వయసు పెరిగే కొద్ది తెలివి తేటలు కూడా పెరుగుతాయి కదా. మా పాపకి 2yrs. ఈమధ్య ఒకసారి మా బాబుతో నువ్వు చెల్లి కన్నా 4yrs పెద్ద కదా అందుకే నువ్వు 4టైమ్స్ ఎక్కువ తినాలి అన్నాను. అప్పుడు వాడు ఐతే నువ్వు నాకన్నా 25టైమ్స్ ఎక్కువ తింటున్నావా మమ్మీ అని అడిగాడు. ఈసారి మాత్రం నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. నేను ఎప్పుడైనా చెల్లి నీకన్న చిన్నది కదా దాన్ని బాగా చూసుకోవాలి తిట్టకూడదు, కొట్టకూడదు అని చెప్పాననుకోండి నేను కూడా నీకన్నా చిన్నవాడినే కదా, మరి నువ్వెందుకు నన్ను తిడతావు అంటాడు. నువ్వు చెప్పిన మాట విని good boy లాగా వుంటే నేను ఎందుకు తిడతాను నాన్న అంటే, మరి చెల్లి కూడా నేను చెప్పినట్టు వింటే నేనెందుకు కొడతాను మమ్మీ అంటాడు . ఈ వయసులో ఆ తెలివితేటలకి నవ్వాలో, అతి తెలివితేటలని బాధ పడాలో అర్ధం కాదు. ఆలోచిస్తే వాడి వాదనలోను పాయింట్ వుంది కానీ వాడు అన్నట్టు "చెప్పినట్టు వినటం" లోనే వుంది తిరకాసు అంతా.
ఇంట్లో ఇద్దరు పిల్లలు వున్నప్పుడు గొడవలు, కొట్లాటలు మాములే అనుకున్నా మా పాప రెండు సంవత్సరాల వయసు నుంచే మొదలు పెట్టింది కొట్టుకోవటం. ఎటువంటి ఆదరణకి నోచుకోని బొమ్మలు ఎన్నో toy box లో అలానే వున్నా పరవాలేదు కానీ ఒక బొమ్మ చెల్లి తీసుకొని ఆడుకోవటం మొదలు పెట్టిందంటే అప్పటికప్పుడు దాని మీద ప్రేమ పుట్టుకొస్తుంది , అది నా బొమ్మ నేను ఆడుకోవాలి, చెల్లి షేరింగ్ చేసుకోవటం లేదు అంటూ కంప్లైంట్స్ మొదలవుతాయి . చెల్లి కూడా అంతే అనుకోండి. ఎవరికీ ఎవరు తక్కువ కాదు. నాకు తెలిసినంత వరకు ఇద్దరు (లేదా ఎక్కువ ) పిల్లలు వున్న ప్రతి ఇంట్లోనూ ఇది సర్వ సాధారణం. కానీ మనం ఎప్పుడైనా మన తల్లి తండ్రులు ఏదైనా పని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు చేయటం లేదు, నువ్వూ ఇలానే చేస్తున్నావు కదా లాంటి ప్రశ్నలు వేసామా? అలా అడిగిన తక్షణం వాళ్ళ చేయి మన చెంప మీద వుండటం తధ్యం. కానీ మా వాడు ఎక్కువ సేపు టీవీ చూడొద్దు నానా అంటే మరి నువ్వు చూస్తున్నావు కదా అంటాడు టక్కున. రెండేళ్ళు వయసున్న నా కూతురు మొబైల్ తీసుకొని vedios ఓపెన్ చేసి చూస్తూ వుంటుంది. దానికి pause చేయటం, vedio నచకపోతే దాన్ని తీసేసి వేరే vedio పెట్టుకోవటం ఇలాంటివన్నీ తెలుసు. కొన్ని కొన్ని ఆటలు కూడా ఆడుకుంటుంది. నా కొడుకు already వున్న గేమ్స్ నచ్చక పోఇన కొత్త అట ఆడాలన్న మూడ్ వచ్చిన వెంటనే app store కి వెళ్లి వాడికి కావాల్సిన గేమ్ సెర్చ్ చేసి password ఎంటర్ చేయటానికి నా దెగ్గరికి తీసుకొస్తాడు. password ఆప్షన్ లేకపోతె అదికూడా వాడే చేసేవాడే. వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు అనుకోవటానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నేను ఇవన్ని ఒక్క మా పిల్లల గురించి మాత్రమే చెప్పట్లేదు. ఈ కాలం లో ఏ తల్లి ని కదిలించినా ఇలాగే మాట్లాడుతుంది అని నా strong feeling.
ఐతే నేను చూసినంత వరకు చిన్న పిల్లలుగా వున్న మనకి, మన పిల్లలకి మద్య తేడాలు తక్కువే. కాకపోతే మనం 6yrs వయసులో చేసిన పనిని మన పిల్లలు 2yrs వయసులోనే చేస్తున్నారు. వీళ్ళకు వున్నన్ని facilities , resources మనకి వుంటే మనం కూడా ఇలానే వున్దేవాల్లమేమో. కానీ మన తల్లి తండ్రులకి , తల్లి తండ్రులుగా మనకి (ఈ కాలం parents కి ) మాత్రం చాల తేడా వుంది. ముక్యంగా మన తల్లి తండ్రులకి సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువగా వుండేది. వాళ్ళ వాళ్ళ feelings ని వాళ్ళు బాగా కంట్రోల్ చేసుకోగలిగే వాళ్ళు. మనం మన పిల్లల మీద చూపించే ప్రేమ కి మన తల్లి తండ్రులు మన మీద చూపించే ప్రేమ కి చాల తేడ వుంటుంది. నేను చెప్పేది ప్రేమలో తేడా వుంది అని కాదు, ప్రేమ చూపించటం (express చేయటం )లోనే తేడా వుంది అని. వాళ్ళు వాళ్ళ ప్రేమని అంతా మనసులోనే దాచుకొని మనల్ని మంచి మనుషులుగా తీర్చి దిద్దాలంటే ఎలా వుండాలో , ఎంత వరకు ప్రేమ చూపిస్తే మనకు ప్రేమ, భక్తీ , భయం ఉంటాయో అంతవరకే చూపించేవాళ్ళు. ఆ విషయం లో వాళ్ళని వాళ్ళు బాగా కంట్రోల్ చేసుకోగలిగే వాళ్ళు. అది ఈ కాలం తల్లి తండ్రుల్లో తక్కువే అని నా ఫీలింగ్. (ofcourse , నా opinion మాత్రమే). మన parents లో లేని మనలో వున్న మరొక ముక్యమైన ఫీలింగ్ 'status'. దానికోసం కూడా మనల్ని మనం అంతగా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. మన తల్లితండ్రులు పిల్లలకి సుఖాలతో పాటు కష్టాలు కూడా తెలియాలి అనుకునేవాళ్లు. కనీసం కష్టాలని సృష్టించక పోఇన వాటిని ఎదురుకోవటం , అది కూడా మన జీవితం లో బాగమే అని కొన్ని అనుభవాల ద్వారా చెప్పటానికి ప్రయత్నిచేవాళ్ళు. కానీ మనం, మన పిల్లలు చిన్న అసౌకర్యానికి గురి ఐనా వాళ్ళ కన్నా మనమే ఎక్కువ బాధ పడి పోతాము. ఆ సమస్యని సాధించటానికి వాళ్ళ కన్నా మనమే ముందుంటాం. ఇంకా వాళ్ళకి నేర్పటానికి అవకాశం ఎక్కడిది? నాకు ఐదేళ్ళ వయసున్నప్పుడే నేను రెండు వీధుల అవతల వున్న ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి అడుకోనేదాన్ని. కానీ ఈ రోజుల్లో పక్కింటికి వెళ్లి ఆడుకోవటానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇండియాలో ఈ విషయం లో కొంచెం బెటర్ అనుకుంట. చిన్న చిన్న పిల్లలు కూడా సిటీ బస్సు ఎక్కి స్కూళ్ళకి వెళ్తున్నారు. కానీ ఏ మాత్రం అవకాశం వున్నా అలా చేయటానికి తల్లితండ్రులు నిరాకరిస్తారని నా అభిప్రాయం. తప్పనిసరి పరిస్తుల్లోనే అలా పంపించినా కూడా చిన్నప్పటినుంచే లోకాన్ని చదవగల తెలివితేటలు ఖచితంగా వాళ్ళ సొంతం అవుతాయి . కానీ అమెరికా లో మాత్రం కనీసం 12yrs వచేవరకు పిల్లల్ని వంటరిగా వదలకూడదు. చివరకి వాళ్ళు play ground కి వెళ్లి ఆదుకోవాలన్న కూడా parents పక్కన వుండాల్సిందే. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఉంటాయి. కాకపోతే నాకు వున్న టైము, ఓపిక తక్కువే కాబట్టి ఇంతటితో "పిల్లలు కాదు పిడుగులు" శీర్షిక సమాప్తం :-)