దాదాపు 6సం క్రితం, మా బాబు కి 4 నెలలు. మా బాసు (అంటే మా వారు) అప్పటికే అమెరికా వెళ్లి 6 నెలలు ఐంది. ఇంకా నేను ఆయన్ని వదిలి ఉండలేను అని, వెంటనే అమెరికా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. టికెట్ ఎలాగో కంపెనీ వాళ్ళు బుక్ చేస్తారు కాబట్టి నాకు , బాబు కి వెంటనే , వీలైనంత తొందరగా టికెట్స్ బుక్ చేయమని ఆఫీసు లో చెప్పాను. నేను తొందరగా అన్నాను కదా అని ఆఫీసు వాళ్ళు కూడా 20 రోజుల్లో ప్రయాణం అని టికెట్స్ బుక్ చేసి చేతిలో పెట్టారు. ఆ ప్రయాణం ఎలా వుందంటే : హైదరాబాద్ to Malaysia, Malaysia to Los Angeles , Los Angeles to San Francisco. ఇది క్లుప్తంగా.
ఇక టికెట్స్ బుక్ అయ్యాయి కదా అని షాపింగ్ స్టార్ట్ చేశాను. అప్పట్లో నాకు షాపింగ్ చేయటానికి తోడు ఎవరు లేకపోవటంతో మా అన్నయ్య ని తీసుకొని చెప్పులు కొన్నుక్కోవటానికి వెళ్ళాను. జనరల్ గ బోయ్స్ కి ఎక్కువ సేపు షాపింగ్ చేయటానికి ఇష్టం వుండదు కదా, అందుకని ఏవో రెండు మూడు జతలు చూసి, కొంచెం tight గ వుండి చూడటానికి బానే వున్న shoe లాంటి చెప్పుల జత ఒకటి సెలెక్ట్ చేసి మా అన్నయ్య ఒక 2,3 టైమ్స్ వేస్తె అదే అడ్జెస్ట్ అవుతుంది అని చెప్పి నా చేత ఆ చెప్పుల జత కొనిపించాడు. ఇంకా నేను ఒక్కదాన్నే, బాబుని తీసుకొని జర్నీ చేయాలి కదా అందుకని బేబీ క్యారీ బాగ్ ఒకటి కొన్నాను. బాబు ని ఈజీ గా క్యారీ చేయొచ్చు అని.
చివరకి జర్నీ డేట్ రానే వచ్చింది. కనీసం గంట తరవాత ఏమి జరుగుతుందో, ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలో కూడా అలోచిందే అలవాటు లేని నేను బాబు కోసం కొంచెం పాల పొడి, కొంచెం సెరెలాక్ వేసుకొని బయలుదేరాను. కొత్తది ఏది కొన్న వెంటనే ధరించే అలవాటు వున్న నేను, కొత్త shoe కూడా వేసుకొని బయలుదేరాను. ఒంటరిగా, బాబుని తీసుకొని.
కొత్త చెప్పులు కొంచెం tight గా వున్నాయని ముందే చెప్పాను కదా, Malaysia వెళ్లేసరికి చెప్పులు కరవటం మొదలు పెట్టి, నడవటానికి నరకం కనిపించటం మొదలు పెట్టింది. ఇంక నా కొడుకేమో ఫ్లైట్ ఎక్కినప్పటినుంచి ఒకటే ఏడుపు. LA లో ల్యాండ్ అవ్వటానికి గంట ముందు I-94 ఫోరం ఇచ్చారు.( అమెరికా లో దిగిన తరవాత Arrival-Departure Record కోసం అక్కడికి వెళ్ళే ప్రతీ వాళ్ళు submit చేయాల్సి వుంటుంది). ఐతే ఈ ఫోరం ప్రతి మనిషి individual గ నింపాల్సి వుంటుంది. కానీ నాకు Air Hostess ఒక్కటే ఫోరం ఇచ్చి ఫిల్ చేయమని చెప్పింది. నేను ఒక్కటే ఇచ్ఛావేంటి అని అడిగితే ఒక్కటి చాలమ్మ అని చెప్పింది. కానీ నాకు మా అయన అవి రెండు ఇస్తారు అని చెప్పారు ఫ్లైట్ ఎక్కేముందు. ఆమె అలా చెప్పేసరికి, సరేలే ఆయనే పొరబడి వుంటారు అనుకోని ఆ ఒక్క ఫోరం నింపి వేశాను. చివరకి చిన్న చిన్న కష్టాల్ని తప్పించుకొని ఎలాగో LA (Los Angeles ) చేరేసరికి ఫ్లైట్ 2hrs లేట్. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నాకు port of entry (అంటే అమెరికా లోకి ఎంటర్ అయ్యే ప్లేస్ అన్నమాట) LA ఇచ్చారు కాబట్టి నేను LA లో దిగి నా luggage అంత తీసుకొని అక్కడినుంచి లోకల్ ఫ్లైట్ ఎక్కాలి. luggage కూడా లోకల్ ఫ్లైట్ లోకి మార్చాలి.
నేను LA లో దిగి తరవాతి ఫ్లైట్ ఎక్కటానికి నాకు వున్న టైం కరెక్ట్ గ 2 గంటలు. ఐతే LA కి వెళ్లేసరికి ఫ్లైట్ రెండు గంటలు లేట్ అని చెప్పాను కదా. అక్కడ దిగి నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కాల్సిన వాళ్ళను అందరిని immigration దెగ్గర కలవమని వాళ్ళకు అందరికి మేము నెక్స్ట్ ఫ్లైట్ కి టికెట్స్ ఇస్తామని చెప్పారు. పోనీలే వాళ్ళు టికెట్స్ ఇస్తారు కదా అని వాళ్ళని జాగ్రతగా ఒక కంట కనిపెడుతూ luggage తీసుకొని కార్ట్ లో పెట్టుకొని (25+25=50kgs luggage) క్యారీ బాగ్ లో బాబు ని కూర్చో పెట్టుకొని కష్ట కష్టంగా కార్ట్ ని తోసుకుంటూ immigration దెగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే ఆ ఆఫీసర్, అమ్మా ఒక్క ఫోరం సరిపోదు, నువ్వు ఇంకోటి కూడా మీ బాబు కోసం ఫిల్ చేయాలి అని చెప్పి ఇంకో ఫోరం చేతిలో పెట్టాడు. అక్కడే నిలబడి దాన్ని ఫిల్ చేయటానికి ట్రై చేస్తున్నాను, ఇంకో పక్క నా కొడుకు ఒకటే ఏడుపు లంకించుకున్నాడు. దానితో నాకు ఫోరం ఫిల్ చేయటం చాల కష్టం ఐపోయింది. నా కష్టాన్ని చూసిన immigration ఆఫీసర్, నాకు ఇవ్వమ్మా నేను నింపుతాను నీకోసం అన్నాడు. హమ్మయ అనుకోని అయన చేతిలో ఫోరం పెడితే అయన గబగబా ఫిల్ చేసి నా పని పూర్తి చేసి passports చేతిలో పెట్టాడు. హమ్మయ అనుకోని వెనక్కి తిరిగి చూదును కదా, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అందరూ వెళ్ళిపోయారు. ఒక్క నిమషం నా గుండె కొట్టుకోవటం ఆగిపోయిందంటే నమ్మండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ ఫ్లైట్ గురించి ఎవరిని అడగాలి.
సరే ఇంకా అక్కడే ఎలాగో ఉండలేము కదా అని అక్కడ directions చదువుతూ airport బయటికి వచ్చాను. అక్కడ ఇన్ఫర్మేషన్ కౌంటర్ ఒకటి కనిపించింది. హమ్మయ అనుకుంటూ అక్కడికి వెళ్లి San Francisco కి వెళ్ళాల్సిన ఫ్లైట్ వెళ్ళిందా అని అడిగాను. ఒకవేళ పొరపాటున నేను ఎక్కాల్సిన ఫ్లైట్ ఇంకా వెళ్ళకపోతే పరిగెత్తుకు వెళ్లి అదే ఎక్కేదాము అని. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నాకు అమెరికా రాకముందు ఎప్పుడు ఇంగ్లీష్ సినిమా చూసే అలవాటు వుండేది కాదు. కాబట్టి నాకు వీళ్ళ accent గురించి అస్సలు ఐడియా లేదు. ఇంకా ఇన్ఫర్మేషన్ కౌంటర్ దెగ్గరికి వెళ్తే, నేను అడిగింది ఆమెకి ఏమి అర్ధం అయిందో తెలియదు కానీ, "I dont Know " అనేసింది. ఏడ్చినట్టుంది, ఇన్ఫర్మేషన్ కౌంటర్ లో వున్నా మనిషి నాకు తెలియదు అనటం ఏమిటో నాకు అర్ధం కాలేదు. సరే కనీసం Malaysian Airlines కౌంటర్ ఎక్కడ వుందో చెప్పు తల్లి అని అడిగాను. ఆమె 4th ఫ్లోర్ లో వుంది అని చెప్పి, లిఫ్ట్ దెగ్గరికి ఎలా వేళ్ళలో చెప్పింది. ఇక్కడ గుర్తుంచు కోవలసిన విషయం ఏంటంటే, నా ముందు luggage , నా క్యారీ బాగ్ లో బాబు అలాగే వున్నారు. దానికితోడు కొత్త చెప్పుల పుణ్యమా ని నడవటమే చాల కష్టంగా వుంది. సరే ఇంకా నేను 4th ఫ్లోర్ కి వెళ్ళాలి కదా అని లిఫ్ట్ దెగ్గరికి వెళ్ళాను. ఆ లిఫ్ట్ ని చూసేసరికి నాకు ఒక విషయం అర్ధం ఐంది. అంత luggage వెంటేసుకొని పైకి వెళ్ళటం కష్టం అని. మళ్ళి తిరిగి ఆ కౌంటర్ దెగ్గరికి వచ్చి ఆమెతో నా గోడు వేల్లబోసుకున్నాను. అప్పుడు ఆమె నా బాధ చూసి, అక్కడే వున్న ఒక employee ని చూపించి ఆమెతో చెప్పు, ఆమె airlines representative ని కిందికి పిలిపిస్తుంది అని చెప్పింది. అబ్బ, చాల పెద్ద సహాయం చేసావు తల్లి అనుకోని ఆమె దెగ్గరికి వెళ్లి నేను పలానా మనిషి తో మాట్లాడాలి అని చెప్పాను. ఆమె సరే అని చెప్పి వెళ్లి 5 నిమిషాల్లో తిరిగి వచింది. అయన వస్తున్నాడు కాసేపు వెయిట్ చేయండి అని చెప్పింది. చెప్పినట్టుగానే 5 నిమిషాల్లో ఒక పర్సన్ వచ్చి "how can I help you?" అన్నాడు. ఆయనకి నా గోడంతా వెల్లబోసుకున్నాను. అయన సరే మేడం మీరు 5 నిముషాలు వెయిట్ చేయండి అని చెప్పి నాది, బాబుది పాస్పోర్ట్ట్స్ తీసుకొని వెళ్ళాడు. ఇచేతప్పుడైతే ఏమి ఆలోచించకుండా ఇచ్చాను కానీ అయన అవి తీసుకొని వెళ్ళినప్పటినుంచి ఒకటే టెన్షన్, అరె నేను అలా ఇచేసానేంటి, అవి అసలే పాస్స్పోర్ట్స్ , వెళ్ళిన వాడు వస్తాడ రాడా , రాకపోతే ఏమి చేయాలి, అవి లేకుండా ఎక్కడికి వెళ్ళాలి... ఇలా వుంది నా మనసు లో టెన్షన్. ఎంత టెన్షన్ అంటే చేతిలో పిల్లాడు వున్నాడు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే అక్కడే కూర్చొని బావురుమని ఎద్చేసేదాన్ని. ఇప్పుడు నేను ఏడిస్తే వాడు ఏమైపోతాడు, అసలే బయలుదేరినప్పటినుంచి వాడు ఒకటే ఏడుపు. చివరకి 5 నిమిషాల్లో వస్తాను అన్నవాడు కాస్తా 20 నిముషాలు వెళ్ళాడు. అతన్ని చూడగానే నాకు పోఇన ప్రాణం తిరిగి వచినంత పని ఐంది. పాపం నాకు, నా కొడుక్కి SFO (San Francisco ) కి 2 టికెట్స్ తీసుకొని వచాడు. టికెట్స్ చేతిలో పెట్టి, అక్కడే నా luggage కూడా తీసుకున్నాడు. మేము ఇక్కడే ఫ్లైట్ లో వేస్తాము లేమ్మా అని. అక్కడినుంచి నేను డొమెస్టిక్ airport కి వెళ్ళాలి. అది పక్కనే, ఒక 5 నిముషాలు నడవాలి. కాకపోతే ఇక్కడ జనాలు ఊరికే నడవటానికి ఇష్టపడరు కనుక అంత తక్కువ దూరానికి కుడా బస్సు సౌకర్యం వుంది. (airport లో టైం కూడా ముక్యమే లెండి). నాకు నడవటం సమస్య కాదు కానీ నా చెప్పులు అప్పటికే నాకు అన్ని రంగులు చూపించి వేసాయి కదా, ఇంకా నడిచే ఓపిక లేదులే అని కాసేపు బస్ స్టాప్ లో ఎదురు చూసాను. అసలే దురద్రుష్టాన్ని నాతో వెంటేసుకొని మరీ వచాను కదా, పైగా నాకు నెక్స్ట్ ఫ్లైట్ కి కరెక్ట్ గ గంట మాత్రమే టైం వుంది. ఇంకా ఎదురుచూసే దైర్యం లేక నేనే చిన్నగా నడక ప్రారంభించాను. అలా బయలుదేరానో లేదో, బస్ వచ్చింది. కాకపోతే ఇక్కడ స్టాప్ లో తప్ప మద్యలో బస్ ఆపరు కనక నాకు బస్ ఎక్కే బాగ్యం దక్కలేదు. ఇక వేరే దారి లేక టెర్మినల్ దాక నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ మళ్ళి చెకప్ అని, అదని ఇదని ఫార్మాలిటీస్ అన్ని పూర్తయేసరికి ముప్పావుగంట. ఇంకో పక్క మా అయన నాకోసం SFO aiport లో వెయిట్ చేస్తున్నాడు కదా. మరి ఆయనకి విషయం చెప్పటానికి నాకు ఇంతవరకు అవకాశమే దొరకలేదు. సరే ఇంక అన్ని సమస్యలు తీరిపోయాయి కదా అని పబ్లిక్ బూత్ నుండి ఫోన్ చేశాను. పాపం అప్పటికి నా దేగ్గరి నుండి ఫోన్ రాకపోయే సరికి చాలా కంగారు పడుతున్నారు. నేను ఎక్కువ విషయాలు చెప్పకుండా ఫ్లైట్ ఆలస్యమైందని ఇంకో గంటలో అక్కడ ఉంటానని చెప్పి పెట్టేసాను.
కరెక్ట్ గా గంట తరవాత ఫ్లైట్ SFO లో దిగి, నేను డొమెస్టిక్ luggage సెక్షన్ కి వెళ్ళాను. మళ్ళి అక్కడ రెండు సూట్కేసులు తీసుకొని కార్ట్ లో వేసుకోవాలి కదా అని అక్కడ నిలబడి వాటికోసం చూస్తున్నాను. ఇంతలో నా వెనక నుండి ఎవరో బుజం మీద చెయ్యి వేసారు. భయంతో వెనక్కి తిరిగి చుస్తే మా వారు. అబ్బ, నిజం చెప్తున్నాను ఆయన్ని చూడగానే నాకు సాక్షాతూ భగవంతుడే ప్రత్యక్షం అయి "బాలికా నీవు తప్పుకో, నీ కష్టాన్ని తీర్చటానికి నేను వచేసానుగా" అని అనిపించిందంటే నమ్మండి. ఇంక ఆ బరువులు, బాద్యతలు ఆయనకి ఇచేసి నేను నేరుగా వెళ్లి కారులో కూర్చున్నాను. ఆ ప్రయాణం దెబ్బకి మళ్ళి ఒంటరిగా వెళ్ళాలంటే బయమేసి 5 సంవత్సరాలు నేను తిరిగి ఇండియా వెళ్లలేదంటే నమ్మండి. అయన వస్తేనే గాని నేను వెళ్ళేది లేదని భీస్మిన్చుక్కుర్చన్నాను.
ఇదండీ నేను జీవితం లో ఎప్పటికి మర్చిపోలేని అనుభవం. ఇప్పుడంటే చాల రోజులైంది కాబట్టి మానేసాను కానీ, అమెరికా వచ్చిన రోజుల్లో ఐతే కనిపించిన ప్రతివాళ్ళకి కూర్చోబెట్టి మరీ చెప్పేదాన్ని నా ఈ కష్టాల్ని. ఇప్పుడు తలచుకుంటే చాల నవ్వొస్తుంది నాకు. అసలు ఇంకో విషయం తెలుసా నేను ఇంటికి వచ్చిన తరువాత చేసిన మొదటి పని ఆ చెప్పులని తీసి అవతల పారేయటం. మల్లీ జన్మలో టైట్ గా వుండే చెప్పులు కొనకూడదు అని నిర్ణయిన్చుకున్నాను. చెప్పులు అనేవి అందంగా వుండటం కన్నా సౌకర్యంగా వుండటం ముక్యం అని నేర్చుకున్నాను. ఇదీ కథ.
కరుణ గారూ, చెప్పుల గురించి తెలుసుకోడానికి అమెరికా వెళ్ళాల్సి వచ్చిందా? :-) :-)
ReplyDeleteఆనే సీరియస్ నోట్.. బాగా రాశారండీ, అనుభవించే వాళ్లకి మాత్రమె అర్ధమయ్యే టెన్షన్ కదూ అది.. అన్నట్టు, ఈ వర్డ్ వెరిఫికేషన్ తీసేయండీ కొంచం..
@మురళి గారు: :-) నిజమే నండి, ఇలాంటివి అనుభవించే వాళ్ళకే తెలుస్తాయి. Thank you very much , మీ అభిప్రాయం చెప్పినందుకు.
ReplyDelete